ఎన్నికల వ్యూహాల్లో రాజకీయ పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు. వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతున్నారు. మరో వైపు అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. అధికార వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా తమకు లభించిన 144 సీట్లలో 139చోట్ల అభ్యర్థులను ప్రకటించింది.


ముందుగా ఎటువంటి విభేదాలు లేని 94 నియోజకవర్గాల్లో అభ్యర్థులను తొలి జాబితాలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో అక్కడ మరో నాయకత్వం లేకపోవడంతో ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ రెండో జాబితా, మూడో జాబితాలో పార్టీలో గొడవలు, నిరసనలు తారా స్థాయికి చేరాయి. కొంతమంది పార్టీ కార్యాలయాల ముందు చంద్రబాబు ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను తగల బెట్టి టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు స్వయంగా కొంతమందితో మాట్లాడి వారిని బుజ్జగించాల్సి వచ్చింది. అయినా కొంతమంది మెత్తబడలేదు. దీంతో వారంతా రెబల్ గా బరిలో దిగే అవకాశం ఉంది.


ఇదిలా ఉండగా సీఎం జగన్ అభ్యర్థులను, సిట్టింగ్ లను మార్చుతూ.. మరికొంత మందికి ఉద్వాసన పలుకుతూ పలు జాబితాలను విడుదల చేశారు. ఇందులో దాదాపు సగానికి పైగా పార్లమెంట్ స్థానాల్లో కొత్తవారికి అవకాశం కల్పించారు. మార్చిన సందర్భంలో వారిలో ఆగ్రహ జ్వాలలు, కంటతడులు, నిరసనలు అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. దీంతో జగన్ కు ఎదురు దెబ్బ తగిలిందంటూ ఎల్లో మీడియా గగ్గోలు  పెట్టింది.


ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో, 25 చోట్ల ఎంపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎక్కడా ఆగ్రహ జ్వాలలు కనిపించడం లేదు. అన్ని చోట్ల వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేసుకుంటూ టీడీపీ కన్నా దూకుడు మీదున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలలో సీట్లు కేటాయింపుపై గందరగోళాలు, ఇచ్చిన సీట్లలో అసంతృప్తి నెలకొన్నాయి. మొత్తంగా కూటమిలో సీట్ల కోసం సిగపట్టు పడుతుంటే.. జగన్ చాలా నీట్ గా తన పని తాను కానిచ్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: