పైకి చెప్పే లెక్కలు సరే.. ఇంటర్నల్‌గా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ వేసుకుంటున్న అసలైన లెక్కలు ఇవే?


ఊహల పల్లకీల్లో అన్ని పార్టీలు..

లెక్కల్లో ఆశలు.. గుండెల్లో గుబులు..

జూన్‌ 4 వరకూ ఆగలేమంటున్న నేతలు..


ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసి వారం రోజులు కావస్తున్నా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. ఏ పార్టీకి ఏ ప్రాంతంలో ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే.. మాదే గెలుపని అటు వైసీపీ, ఇటు కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పైకి ఎన్ని చెబుతున్నా లోపల మాత్రం గుబులుగానే ఉంది. పెరిగిన పోలింగ్ శాతం ఎటు దారి తీస్తుంది.. ఏ వర్గాలు ఎటు ఓటేశాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.పైకి చెప్పే మాటలు సరే.. అసలు పార్టీల్లో అంతర్గతంగా ఏం చర్చ జరుగుతోంది అన్న అంశంపై ఇండియా హెరాల్డ్ టీమ్‌ సమాచారం సేకరించింది. ఆ వివరాలు ప్రత్యేకంగా మీ కోసం. వైసీపీ వాళ్లు మాత్రం కాస్త మెజారిటీ తగ్గినా తమదే గెలుపు అంటున్నారు. అంతర్గతంగానూ అంతే ధీమాగా ఉన్నారు. 110-120 సీట్లతో తమ గెలుపు ఖాయం అంటున్నారు. రాయలసీమలోనే కనీసం 40 వరకూ సీట్లు దక్కించుకుంటామని లెక్కేసుకుంటున్న వైసీపీ నేతలు.. సీట్లు తగ్గినా అధికారం మాత్రం తమదేనని లెక్కలు వేసుకుంటున్నారు. ఉత్తరాంధ్రలో 50-50 సీట్లు వస్తాయని అంచనా వేసుకున్నా జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు.టీడీపీ మాత్రం కూటమితో కలుపుకుని 105 నుంచి 110 సీట్లు గ్యారంటీగా వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గూంటూరు జిల్లాల్లో  మెజారిటీ సీట్లు కూటమివేనని.. ఈ నాలుగు జిల్లాల్లోనే కనీసం 50 సీట్లు వస్తాయని అంతర్గతంగా లెక్కలు వేసుకుంటున్నారు. చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్న అంచనాలో ఉన్న ఆ పార్టీ నేతలు.. అప్పుడే అదికారంలోకి వచ్చేశామన్న ఫీలింగ్‌లో ఉన్నారు.ఇక జనసేన విషయానికి వస్తే పోటీ చేసిన 21 సీట్లలో తప్పకుండా 15 వరకూ గెలుస్తాని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సక్సస్‌ రేటు తమదేనని.. ఎన్నికల తర్వాత పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషిస్తారన్న అంచనాల్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇక

బీజేపీ కూడా మూడు, నాలుగు అసెంబ్లీ సీట్లు గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు. ఎంపీ సీట్లు పక్కాగా మూడు గెలుస్తామని బీజేపీ లెక్క వేసుకుంటోంది. అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లు తమవేనని ధీమాగా ఉన్నారు. మరి ఈ అంచనాల్లో ఏవి నిజం అవుతాయో జూన్‌ 4న కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: