
ఇలా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు ఎన్నో రోజుల నుంచి కష్టపడిన.. ఎవరికో ఒక్కరికి మాత్రమే ఇక గవర్నమెంట్ ఉద్యోగం వరించి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. ఇక ఇలా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి బాగా చదివినవారు.. ఆ తర్వాత జాబ్ రాక ఆశలు వదులుకొని ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఉద్యోగం రావడం ఎంత కష్టమో మీకే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక అమ్మాయి మాత్రం ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఒకటి సాధించడానికే అందరూ తెగ కష్టపడి పోతుంటే.. ఈమె ఏకంగా ఏడు ఉద్యోగాలు సాధించడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లోని ధవలేశ్వరానికి చెందిన అంబటి కీర్తి నాయుడు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏడు ఉద్యోగాలు సాధించారు. తాజాగా ఆమెకు జిఎస్టి ఇన్స్పెక్టర్ జాబ్ కూడా వచ్చింది. అంతకుముందు ఆదాయపన్ను శాఖలో ఉపాధికారిగా ఉద్యోగం, కస్టమ్స్ విభాగంలో టాక్స్ అసిస్టెంట్, SST-MTS, రైల్వేలో ఉన్న ఉద్యోగం, పోస్టల్ విజిలెన్స్ విభాగంతో పాటు మరో ప్రభుత్వ ఉద్యోగానికి కూడా ఆమె ఎంపిక అయింది. సివిల్స్ ఆమె టార్గెట్ అంటూ చెబుతుంది సదరు యువతి. ఇలా ఏకంగా ఒక్క యువతి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.