బంగారం నిల్వలు పెరగడంతో విదేశీ మార్కెట్ లో పసిడి కి డిమాండ్ తగ్గింది.. దీంతో భారత్ కూడా రేట్లు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం రేట్లను చూసుకుంటే.. ఈరోజు రేట్లు పూర్తిగా పడిపోయాయి.బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గుదలతో రూ.51,550కు క్షీణించింది. ఇకపోతే 22 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు రూ.340 తగ్గింది. దీంతో ధర రూ.47,250కు పడిపోయింది.
బంగారం ధర పూర్తిగా కిందకు వస్తుంటే , వెండి ధరకు మాత్రం రెక్కలు వచ్చాయి.బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం దూసుకెళ్లింది. కేజీ వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో వెండి ధర రూ.67,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి ఆడర్లు పూర్తిగా పెరగడంతో వెండికి డిమాండ్ భారీ స్థాయిలో పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెట్టింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1912 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 24.42 డాలర్లకు మొగ్గు చూపింది. రేపటికి రేట్లు ఎలా మారతాయో చూడాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి