ఇక తాటికల్లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ పేరు వినగానే మనకు ఖచ్చితంగా ముందుగా పల్లెటూరి వాతావరణం గుర్తుకు వస్తూ ఉంటుంది. పల్లెటూర్లలో పెద్దపెద్ద తాటి చెట్లు ఉండటం ద్వారా ఈ తాటికల్లును తయారు చేస్తూ ఉంటారు.దీని పేరు తలచుకుంటే నోరూరుతూ ఉంటుంది. చాలామంది నిజ జీవితంలో ఈ తాటికలను తాగే ఉంటారు. అచ్చమైన తాటికల్లును తాగినప్పుడు కాస్త మత్తుగా ఉంటుంది అని కూడా అంటూ ఉంటారు. కానీ రాను రాను ఈ తాటికల్లు కూడా కల్తీ అయిపోయింది. ఈ తాటి కల్లు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం  తెలుసుకుందాం.తాటికల్లులో విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే ఇది వరకు మన పూర్వీకులు ఈ తాటిచెట్టుని కల్పవృక్షంగా చెప్పేవారు. ప్రతి ఆరోగ్య సమస్యకి కల్లు ద్వారానే పరిష్కారం వెతుక్కునేవారు అంటే కల్లుకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చేవారు అర్థం చేసుకోవచ్చు.


అప్పుడే చెట్టు నుంచి తీసిన తాటికల్లు తాగితే అందులో ఉన్న ఓ సూక్ష్మజీవి మానవుని కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారకాన్ని నాశనం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.అయితే చెట్టు నుంచి తీయగానే తాగితే ఈ ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా అందుతాయి. అయితే తాటికలను చెప్పి నుండి తీసిన తరువాత కొన్ని గంటలకు అది తాగితే అది పులిసిపోయి ఆల్క్‌హాల్‌గా మారిపోతుంది. దాన్ని తాగితే ఆరోగ్యానికి హానికరం. అందుచేత చెట్టు నుంచి తీసిన కల్లునే తాగాలని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. తాటికల్లు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులకు కారణం అయ్యే వైరస్‌కు తాటికల్లు యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. అలాగే తాటికల్లులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాదుల బారిన పడకుండా కాపాడుతుంది. అంతే కాకుండా తాటికల్లు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయటంలో బాగా ఉపయోగపడుతుంది.కాబట్టి తాటి కల్లు తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి: