పూర్వం రోజుల్లో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వయసు మళ్ళిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారపు అలవాట్లు, జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వేడిస్తున్నాయి.వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులు వాడిన ఏ ప్రయోజనం కలగక,చాలా ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారి కోసం మన ఆయుర్వేద చికిత్సలో భాగంగా కొన్ని రకాల పదార్థాలతో తయారుచేసుకునే మందు ఎలాంటి నొప్పులకైనా ఇట్టే తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి.

సాధారణంగా కీళ్ల నొప్పులు మన శరీరంలోని ఎముకలు మృదలాస్త్రి దెబ్బ తినడం వల్ల,వస్తుంటాయి. ఇది అధిక బరువు వల్ల గాని,వంశపారంపర్యంగా గాని, యాక్సిడెంట్ వల్ల కానీ మృదులాస్థి దెబ్బతిని నొప్పులను కలుగజేస్తూ ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి మన వంటింట్లో లభించే కొన్ని పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.

 తయారు చేసుకునే విధానం..
 ఒక గిన్నెలో నాలుగైదు స్పూన్ల ఆవనూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ దాల్చిన చెక్కపొడి,ఒక స్పూన్ మెంతులు, నాలుగు ఐదు రెబ్బల వెల్లుల్లి, నాలుగైదు లవంగాలు తీసుకుని బాగా మిక్సీ పట్టి, ఆ మిశ్రమాన్ని ఆవనూనెలో వేసి స్టవ్ మీద పెట్టి, బాగా మరిగించాలి.ఈ మిశ్రమంలోని గుణాలన్నీ నూనెలోకి దిగి, నూనె రంగు మారిన తరువాత మంటను ఆపేయాలి.దీనిని రాత్రంతా అలాగే నిల్వ ఉంచి, మరుసటి రోజూ ఉదయాన్నే ఒక సీసాలోకి వడకట్టుకోవాలి.ఈ నూనెను నొప్పులు కలిగిన ప్రతిచోట పూసి,మర్దన చేసుకోవాలి. దీనితో పాటు ఒక బాండీలో ఒక గుప్పెడు ఇసుక వేసి, వేడి చేసి, దానిని ఒక మెత్తని వస్త్రంలో మూట కట్టాలి. దీనిని నొప్పి వున్న చోట, గోరు వెచ్చగా ఉన్నప్పుడే కాపడం పెట్టాలి.దీనితో ఎలాంటి నొప్పులకైనా,ఇట్టే ఉపశమనం కలుగుతుంది.నువ్వుల నూనె బోన్ స్ట్రెంత్ పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.దీనితో పాటు,తగిన వ్యాయామలు చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: