వర్షాకాలం వచ్చిందంటే చాలు అందరికీ భయం పట్టు కుంటుంది. ఎందుకంటే సీజనల్ వ్యాధులకు కేరాఫ్ అడ్రస్ వర్షాకాలం. అందుకే ఈ సీజన్లో ఇక ఆరోగ్యం పట్ల  అతి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. లేదంటే సీజనల్ వ్యాధులు సోకి చివరికి ఆస్పత్రి పాలు కావడం ఖాయం అని చెబుతూ ఉంటారు. ముఖ్యం గా  వర్షా కాలంలో డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు  ఎంతో మందిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.



 వర్షా కాలంలో కాస్త చినుకు పడింది అంటే చాలు చుట్టుపక్కల ప్రాంతాలు తడిగా మారి పోతాయి. కాస్త ఎక్కువగా వర్షం కురిస్తే ఎక్కడికక్కడ వీళ్లు నిలిచిపోతాయి. ఇక నిలిచిన నీళ్లపై వాలిన దోమలు, ఈగలు ఇక ఇళ్ళలో ఉన్న మనుషులపై దాడి చేస్తాయి. ఇంకేముంది  ఇదంతా జరిగిన తర్వాత సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయా.  అందుకే వర్షాకాలంలో చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉత్తమం. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి.




 వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం  ఎంతో మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.  అలా అని ఏది పడితే అది తిన్నా కూడా ప్రాబ్లమే. వర్షాకాలంలో కేవలం కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో ఇమ్యూనిటీని పెంచడానికి వెల్లుల్లి, నిమ్మ ఎంతగానో ఉపయోగపడతాయి.  సీజనల్ వ్యాధులతో పోరాడటానికి వెల్లుల్లి ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇక నిమ్మకాయలు ఎక్కువగా విటమిన్ సి అన్ని రకాల ఇన్ఫెక్షన్లు  తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఇలా ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని చేస్తున్నారు  .. ముఖ్యంగా వర్ష కాలంలో పరిసరాల పరిశుభ్రతే ఇక వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రధానమైన ఆయుధం అంటూ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: