నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం ఎవరికీ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా మొదట్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు.. ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో కనిపిస్తూ ఉంది. అయితే టైం లేకపోవడంతో నేటి రోజుల్లో కొంతమంది కనీసం బ్రష్ చేయడానికి కూడా సమయం కేటాయించడం లేదు. వెరసి ఇలా బ్రష్ చేయకపోవడం కారణంగా ఇక పుచ్చి పళ్ళు వచ్చి ఇక దంతాలు దెబ్బతింటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది.



 ఇటీవల కాలంలో చాలామంది పుచ్చిపన్ను సమస్యతో బాధపడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే డెంటిస్ట్ దగ్గరికి పరుగులు తీస్తూ ఇక ఎంతో ఖర్చుపెట్టి మరి ఈ పుచ్చుపన్నుని తొలగించుకుంటూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. అయితే పుచ్చు పన్ను విషయంలో ఎంతోమందిలో ఎన్నో అనుమానాలు అప్పుడప్పుడు రేకెత్తుతూ ఉంటాయి. పుచ్చు పన్ను కారణంగా ఏకంగా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయా అని ఎంతో మంది అనుమాన పడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవలే ఇదే విషయంపై ఒక వైద్యుడు ఆసక్తికర సమాధానం చెప్పాడు.



 పళ్ళు పుచ్చిపోయిన వ్యక్తికి గుండెలో నొప్పి రావడం గురించి ఒక నేటిజన్ ప్రశ్న అడగగా.. ఓ వైద్యుడు ఇచ్చిన రిప్లై కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పుచ్చి పన్ను ఉన్న వ్యక్తులు ఏదైనా గట్టిగా కొరికినప్పుడు పుచ్చు పన్నులో ఉన్న బ్యాక్టీరియా సరాసరి రక్తంలోకి వెళ్లి అక్కడి నుంచి ఇక గుండెలోకి వెళ్తుంది  ఇలా గుండెలోకి వెళ్లిన బ్యాక్టీరియా గుండె కవటాలలో పుండ్లు కావడానికి కారణం అవుతుంది. దీంతో జ్వరం ఛాతి నొప్పి లాంటి సమస్యలు వస్తాయని వైద్యుడు చెప్పుకొచ్చాడు. వెంటనే వైద్యం చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అందరిలో ఇలా జరిగే అవకాశం ఉండదు అంటూ సదరు వైద్యుడు చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: