ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి ఎలా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. క‌రోనా మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువుగా ఉన్న వారిపైనే ప్ర‌ధానంగా ఎటాక్ చేస్తుంది. ఇక వీరి సంగ‌తి ప‌క్క‌న పెడితే ప్ర‌ధానంగా 60 ఏళ్లు పై బ‌డిన వృద్ధుల‌తో పాటు 10 ఏళ్ల లోపు పిల్ల‌లు లేదా ఒక్కో సారి 15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌పై కూడా క‌రోనా ప్ర‌ధానంగా ఎటాక్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా నుంచి వృద్ధుల‌ను, పిల్ల‌ల‌ను కంటికి రెప్పలా కాపాడు కోవ‌డం అంద‌రి ముందు ఉన్న క‌ర్త‌వ్యం. 

 

ఇక ప్ర‌తి ఒక్క త‌ల్లి దండ్రులు ఈ స‌మ‌యంలో త‌మ పిల్ల‌ల‌ను క‌రోనా నుంచి కాపాడు కోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలోనే పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క పెంచేందుకు ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పిల్ల‌ల‌కు ట‌మాటాలు, యాపిల్స్‌, యాపిల్ జ్యూస్‌, బాదం, పిస్తా లాంటి వాటిని ప్ర‌తి రోజు పెట్ట‌డం వల్ల పిల్ల‌ల్లోనూ, పెద్ద వారిలోనూ రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ముఖ్యంగా క‌రోనా చిన్న పిల్ల‌లు లేదా పెద్ద వాళ్ల‌లో ఊపిరి తిత్తుల మీద ఎక్కువుగా ప్ర‌భావం చూప‌డం వ‌ల్లే అవి ప్ర‌భావిత‌మై ప్రాణాల‌కు ప్ర‌మాదం వాటిల్లుతోంది.

 

ఈ క్ర‌మంలోనే వీటిని తిన‌డం వ‌ల్ల ఊపిరి తిత్తులు ఆరోగ్యంగా ఉంటాయ‌ట. ఇక పిల్ల‌ల‌కు ఈ ఆహారం అందించ‌డంతో పాటు వారి వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త విష‌యంలో త‌ల్లి దండ్రులు ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెపుతున్నారు. ముఖ్యంగా పిల్ల‌ల‌ను ఈ టైంలో బ‌య‌ట‌కు వెల్ల‌కుండా చూసుకోవ‌డంతో పాటు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో హాస్ప‌ట‌ల్స్‌కు వెళ్లాల్సి వ‌స్తే ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేతులు వేసిన త‌ర్వాత వాటిని శానిటైజ‌ర్ లేదా ఇత‌ర స‌బ్బుల‌తో కనీసం 40 సెక‌న్ల పాటు శుభ్ర ప‌రిచిన త‌ర్వాత వారికి చేతికి ఆహారం ఇవ్వాల‌ని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: