
స్త్రీలలో రుతుక్రమణం వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి సరిగా జరిగి, మన ఆయుషును పెంచడంలో సహాయం చేస్తుంది.ఎర్లీ మోనోపాజ్ వల్ల ఈస్ట్రోజన్ ఉత్పత్తి ఆగిపోయి, తిన్న ఆహారం నుంచి కాల్షియం అబ్జార్ప్సన్ తగ్గి, ఎముకలు గుల్లబారి,దీనివల్ల చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోతూ ఉంటాయి.
ఎర్లీ మోనోపాజ్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలై, సంతోషకరమైన హార్మోన్స్ తగ్గి, విచారకరమైన హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల స్త్రీలు ఎక్కువగా డిప్రెషన్ కి గురవుతారు.మరియు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి,రక్తసరఫరా సక్రమంగా జరగదు. దీనితో గుండె పనితీరుపై భారం పెరిగి, గుండెసమస్యలు చుట్టుముడతాయి. మోనోపాజ్ కంటే ముందు స్త్రీలలో ఈస్ట్రోజన్ ఉత్పత్తి సక్రమంగా జరిగి,హార్ట్ఎటాక్ రాకుండా కాపాడుతుంది.దీనితో సాధారణంగా మోనోపాజ్ వచ్చే వారి కంటే ఎర్లీ మోనోపాజ్ వచ్చిన వారికి ఆయుర్దాయం మూడు సంవత్సరాలు తగ్గుతుందని, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ నిరూపించారు.
ఎర్లీ మోనోఫాజ్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన డైట్..
ఎర్లీ మోనోపాజ్ రాకుండా స్త్రీలకు అత్యంత ఉపయోగకరంగా ఉండే ఆహారంగా సొయా ఉత్పత్తులని చెప్పవచ్చు. ఎర్లీ మోనోపాజ్ రాకుండా ముందుగానే మన ఆహారంలో సోయా గింజలు వాడడం ఉత్తమం. దీనికోసం ఉదయాన్నే, సోయా గింజల మొలకలు కూరగాయ ముక్కలు, పండ్లుతో సలాడ్స్ చేసుకొని, తరుచూ తినడం వల్ల హార్మోన్స్ సరిగా రిలీజ్ అవుతాయి.మరియు వృద్యాప్య ఛాయాలను తొలగిస్తుంది.ఇలాంటి డైట్ తీసుకోవడం వల్ల సంతానలేమితో బాధపడేవారికి కూడా, సంతాన సమస్యలు తొలుగుతాయి. కావున ప్రతి స్త్రీ సొయా ఉత్పత్తులను తరుచూ తీసుకోవడం వల్ల ఎర్లీ మోనోపాజ్ రాకుండా తమని తాము రక్షించుకోవచ్చు.