వావ్‌.. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా కొత్త ఏడాదికి మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2019కి గుడ్ బై చెప్పేసి.. 2020కి వెల్ కమ్ చెప్పేందుకు అంద‌రూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కుల, మ‌త బేధాలేమీ లేకుండా జ‌రుపుకునే పండ‌గే న్యూయ‌ర్‌. ప్రతిఏడాది స్నేహితులతో, ఫ్యామిలీలతో పాటు ప్రత్యేకించి ప్రేమజంటలన్నీ ఎంతో ఉత్సాహంగా ఇయర్ ఎండ్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక న్యూయ‌ర్ వ‌చ్చిందంటే బిర్యానీ చాలా స్పెష‌ల్ అని చెప్పాలి. అయితే ఆ సారి బ‌య‌ట నుంచి కాకుండా.. ఇంట్లోనే ఎంతో సులువుగా `ద‌మ్ బిర్యానీ` ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

కావాల్సిన ప‌దార్థాలు: చికెన్‌- ఒక కిలో, బాస్మతి బియ్యం- ఒక కిలో, గరం మసాలా- రెండు టీ స్పూన్లు, పెరుగు- ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, అల్లం పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూను, నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు, వెల్లుల్లి పేస్ట్‌- ఒక టేబుల్‌ స్పూను,ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, పచ్చిమిరపకాయలు- ఐదు, ఎండు మిరపకాయలు- ఆరు, పసుపు- చిటికెడు, కొత్తిమీర- కొద్దిగా.

 

తయారీ విధానం: ముందుగా మాంసాన్ని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పెరుగు వేసి బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టాలి. త‌ర్వాత ఒక క‌ప్పు బియ్యానికి రెండు క‌ప్పుల నీళ్లు పోసి రైస్ ఉడికించి ప‌క్క‌న పెట్టుకోవాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన స‌గం ఉడికిన రైస్‌, కొత్తిమీర‌ వేయాలి. 

 

మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి. దానిపై మిగిలిన రైస్‌, కొత్తిమీర‌ వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి. పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేస్తే స‌రిపోతుంది. అంతే ఘుమఘుమలాడే ద‌మ్‌ బిర్యాని రెడీ. లాస్ట్‌లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో డెక‌రేట్ చేసుకుంటే స‌రిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: