థైరాయిడ్ అనే వ్యాధి చాలామందిని వేధించే సమస్య.. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే హైపర్ థైరాయిడిజం వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ స్థాయి హెచ్చు తగ్గులకు లోనవుతుంది. దీనివల్ల అనేక రకాల సమస్యలు కూడా మొదలవుతాయి. థైరాయిడ్ సమస్యను నియంత్రించాలంటే ముందుగా మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలట. ఈ రోజు మనం తీసుకొనే డైట్ పై ప్రత్యేకమైన  వాటి గురించి మనం చూద్దాం.

బరువు పెరగడం లేదా తగ్గడం.. ఎక్కువగా జుట్టు రాలడం, చర్మం పొడిగా మారడం, మెడలో వాపు సమస్య.. గుండె కొట్టుకోవడం లోని మార్పులు, చేతులు కాళ్లు తిమ్మిర్లు పట్టడం.. మలబద్దక సమస్య, ఆతి సారం సమస్య వంటివి థైరాయిడ్ లక్షణాలు గా గుర్తిస్తారు.

థైరాయిడ్ తగ్గించుకునేందుకు చిట్కాలు..
క్లినికల్ న్యూట్రిషనిస్ట్  అన్షుల్ జై భారత్ మాట్లాడుతూ.. థైరాయిడ్ లో ఆహారం పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించ వచ్చట. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఆరోగ్యకరమైన.. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్య మట.

అందులో ముఖ్యంగా మినుములు ఎక్కువగా తీసుకోవాలి.. భోజనం అస్సలు మానేయకూడదు. చాలా మంది బరువు తగ్గడానికి ఆహారాన్ని వదులుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా తప్పు.. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఆహారాన్ని ఎప్పుడు దూరం పెట్టకూడదు. ప్రతి రోజు కూడా సోయాబీన్స్.. అవిసె గింజలు తినకూడదు. అంతేకాకుండా కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి అస్సలు తినకూడదట. వీటిని సరిగ్గా ఉడకబెట్టిన తరువాతనే తినాలి. సీజన్లో దొరికే పండ్లు కాయగూరలు తరచు తింటూ ఉండాలి. ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తింటూ ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ,జంక్ ఫుడ్ లను పూర్తిగా తగ్గించాలి. మద్యపానం, ధూమపానం వంటివి నియంత్రించాలి. థైరాయిడ్ సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి చెకప్ చేయించుకుంటూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: