
తాటి బెల్లమును ఖర్జూర రసం నుంచి కానీ, తాటికాయలను ఒక మోతాదులో కాల్చి, తయారుచేస్తారు.ఇందులోని సహజ చక్కెరలు తీపిని తెస్తాయి.దీనిని తరచూ ఉపయోగించడం వల్ల,మధుమేహంతో బాధపడేవారికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు బెల్లం వేసిన స్వీట్లు కానీ, కాఫీ,టీలు కానీ అసలు తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు కదా..అలాంటి వారి కోసం తాటి బెల్లంతో తయారుచేసిన పదార్థాలు నిర్భయంగా తీసుకోవచ్చు.ఈ బెల్లం ని తీసుకోవడం వల్ల వారి రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి కూడా.
మరియు ఈమధ్య కాలంలో చాలామంది స్త్రీలు పిసిఒడి,పిసిఓఎస్,అధిక రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు.దానికి కారణం వారు తరచూ అధిక షుగర్ లు ఉన్న బెల్లం మరియు చక్కెర తీసుకోవడం వల్లనే..కావున అలాంటి వారికి కూడా తాటిబెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది.పిసిఒడి మరియు పిసిఓఎస్ సమస్యలతో బాధపడేవారు బెల్లం మరియు నువ్వులతో తయారు చేసిన లడ్డూలను తీసుకోవడం వల్ల,వారు సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.అంతేకాక అధిక బరువుతో బాధపడే వారికి కూడా తొందరగా బరువు తగ్గడానికి తాటిబెల్లం ఉపయోగపడుతుంది.
అంతేకాక తాటిబెల్లంలోని ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది.మరియు పూర్వం రోజుల్లో పిల్లలకు జలుబు చేసినప్పుడు ఔషదాలు బదులుగా తాటిబెల్లం ఇచ్చేవారట.అలా ఇవ్వడంతో జలుబు,దగ్గు నుంచి ఉపశమనం పొందడంతో పాటు శ్లేష్మాన్ని మెత్తగా చేసి,పేరుకుపోయిన శ్లేష్మాన్ని బయటకు వచ్చేందుకు దోహదపడుతుందట.కావున ప్రతిఒక్కరూ సాధారణ బెల్లం మరియు చక్కెరలు వాడటం తగ్గించి,తాటిబెల్లం ఉపయోగించడం చాలా మంచిది.