గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ గింజల్లో ఆరోగ్యకరమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మాంసం, చికెన్ కంటే ఇందులో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇవి మనకు తక్కువ ధరలో లభిస్తాయి. మెదడు చురుకుగా పని చేయాలనుకునే వారు, మేధాశక్తి, ఆలోచనా శక్తి పెరగాలనుకునే వారు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల తగినంత జింక్ లభిస్తుంది.దీంతో మెదడు చురుకుగా పని చేస్తుంది. చదువుకునే పిల్లలకు గుమ్మడి గింజలను ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. పిల్లలకు గుమ్మడి గింజలను ఇవ్వడం వల్ల తెలివితేటలు పెరగడంతో పాటు వారిలో ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుమ్మడి గింజలను నానబెట్టి తీసుకోవచ్చు. అలాగే వీటితో కారం పొడి తయారు చేసి నిల్వ చేసుకుని తీసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా వీటిని వేయించి లడ్డూలుగా తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. గుమ్మడి గింజల్లో జింక్ అనేది ఎక్కువగా ఉంటుంది.


జింక్ లోపించడం వల్ల పిల్లలు ఎక్కువగా హైపర్ యాక్టివ్ గా ఉంటున్నారని, వారిలో ఆలోచనా శక్తి తగ్గిపోతుందని అలాగే వారిలో మానసికపరమైన సమస్యలు వస్తున్నాయని, వారికి చదువు మీద ఆసక్తి తగ్గిపోతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జింక్ లోపించడం వల్ల మెదడు కణాల్లో ప్రోటీన్ చైన్స్ ఎక్కువగా దెబ్బతింటాయని దీంతో మెదడు కణాలు దెబ్బతిని మతిమరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాలింతలల్లో కనుక జింక్ లోపం ఉంటే వారి పాలు తాగిన పిల్లలకి కూడా మానసిక పరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.గర్భిణీ స్త్రీలు, బాలింతలు జింక్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవడం చాలా అవసరమని వారు చెబుతున్నారు. మన శరీరానికి రోజుకు 8 మిల్లీ గ్రాముల జింక్ అవసరమవుతుంది. మనం తీసుకునే ఆహారాల్లో జింక్ ఉన్నప్పటికి అన్నింట్లో కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటుంది.గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: