
అందుకే ఏ విషయంలోనూ, ఏ వ్యక్తిని పూర్తిగా ' ఫలానా టైప్ ' అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కరిలో ప్లస్, మైనస్ లు ఉంటాయి. కాకపోతే... అవి ఇతరులకు, సమాజానికి చేసే మంచి చెడులపై డిపెండ్ అయి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తాయి అంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో అబద్దం కూడా ఒకటి. మనం వాటిని ఏవో సందర్భాల్లో ఎందుకు ఆశ్రయిస్తామో ఇప్పుడు చూద్దాం. అబద్ధమాడటం మంచిది కాదని అందరూ చెబుతుంటారు. మనకు తెలుసు... కానీ ఆడకుండా ఉంటామా? అసలు ఉండగలమా? నో సాధ్యం కాదు. ఎంత నిజాయితీ పరులైన ఏదో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెబుతుంటారు. తరచుగా అబద్ధాలాడటాన్ని సమాజం, మన చుట్టూ పక్కల వ్యక్తులు తప్పు పడతారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే అబద్దాలను ఆ సమాజమే, ఆ వ్యక్తులే సమర్థిస్తారు.
ఎందుకంటే అబద్దాలు అందరూ ఆడతారు. కరెక్ట్ కాదని తెలిసిన ఎందుకు అబద్ధాలు ఆడతారు? అంటే అదంతే.. మనిషి లక్షణం, మనుగడలో భాగం. సరదాకో, అవసరానికో, భయంతోనో, భక్తితోనో, మంచి కోసమో, స్వార్థం కోసమో ఏదో ఒక అవసరం కోసం అబద్ధాలు చెబుతుంటాం. కేవలం చెప్పే వారే కాదు. వాటిని విని నమ్మేవారు. ప్రచారం చేసేవారు, అబద్దాలతో ఆకట్టుకునే వారు, నిజమని నిరూపించగలిగే వారు కూడా ఉంటారు. ఇలాంటి పాత్రలు మన చుట్టూ సమాజంలో చాలానే ఉంటాయి. ఏదో ఒక సందర్భంలో మనమూ ఏదో ఒక పాత్ర పోషిస్తుంటాం. అయినప్పటికీ అబద్ధం ఎల్లప్పుడూ బ్యాడ్ బిహేవియర్ గా పరిగణించడుతుంది. బెడిసి కొడితే సామస్యలను క్రియేట్ చేస్తుంది. అందుకే అబద్ధం ఆడటం అన్ని విషయాల్లో మంచిది కాదు. తెలిసినా ఎందుకు అబద్దం చెబుతారు? అంటే.. ఎవరి కారణాలు వారికి ఉంటాయి.