
ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మనకు అలసటగా, బలహీనంగా అనిపిస్తున్నప్పుడు మేక పాలను తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా లాక్టోజ్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఉండే లాక్టోజ్ స్థాయి తక్కువగా ఉంటుంది కనుక లాక్టోజ్ ప్రాబ్లమ్ ఉన్నవారూ దీన్ని తేలికగా జీర్ణించగలుగుతారు. మేక పాలలో ఉండే కొవ్వు కణాలు చిన్నగా ఉండటం వల్ల అవి త్వరగా చెమటగా మారి శరీరానికి శక్తినిస్తాయి.
మేక పాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. చర్మవ్యాధుల నుంచి ఉపశమనాన్ని పొందాలంటే మేక పాలను తాగడంతో పాటు సరైన విధంగా ఉపయోగించడం వల్ల కూడా ఫలితాలు కనపడతాయి. మేక పాలతో తయారయ్యే సబ్బులు, క్రీములు చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతాయి.
ఇది ఎముకల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి ఖనిజాలు ఎముకల బలానికి, దంతాల దృఢతకు అవసరమైనవే. పెరుగుతున్న వయస్సులో ఎముకల బలహీనతను తగ్గించేందుకు మేక పాలు మంచి చాయిస్ అని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు