చాలామందికి ఉదయం లేచి లేవగానే పళ్ళు కూడా తోముకోకుండా టీ , కాఫీ తాగే అలవాటు ఉంటుంది . కొంతమంది అయితే మంచం మీద నుంచి లేయకుండానే టీ తాగుతారు. అలా తాగితేనే వాళ్లకి కిక్ వస్తుంది దానితో పాటు ఎనర్జీ వస్తుంది.  అలాంటి ఒక హాబిట్ ఉంటుంది . అయితే అది చాలా చాలా మంది ఇది  ప్రమాదకరం అంటున్నారు వైద్యులు . రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత నుంచి రాత్రి మళ్ళీ పడుకునే వరకు టీ, కాఫీలు ఎక్కువగా తాగేస్తే బాడీ మొత్తం డామేజ్ అయిపోతుంది అంటూ హెచ్చరించేస్తున్నారు .


పొద్దు పొద్దున్నే లేచి నీళ్లు కూడా తాగకుండా అలా టీ , కాఫీలు తాగడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది అంటూ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మోతాదుకు మించి టీ , కాఫీలు సేవించడం వల్ల దుష్పరిణామాలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరిస్తున్నారు . టీ, కాఫీలల్లో కెఫిన్ ఎక్కువుగా ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు . మన శరీరానికి రోజుకి 400 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ చాలు . అంతకుమించి ఎక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం . ఒక కప్పు టీ లేదా కాఫీ తాగితే సుమారు 100 మిల్లి గ్రాముల మేరా కెఫిన్ లభిస్తుంది . అంటే టీ లేదా కాఫీ ఏదైనా సరే రోజుకి నాలుగు సార్లు తాగొచ్చు అంతకన్నా ఎక్కువగా తాగకూడదు. కొంతమంది 10 - 12 తాగుతూనే ఉంటారు.  చాలా మంది వర్క్ చేసే వాళ్ళు తలనొప్పి అంటూ ఒకసారి వర్క్ ప్రెజర్ అంటూ మరొకసారి కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు.



అలాంటి వాళ్లకి నిద్ర  సమస్యలు కూడా ఎదుర్కోవాస్లి ఉంటుంది.  టీ , కాఫీలు తాగడం వల్ల మన శరీరంలో చేరే కెఫిన్ మెలోడీన్  ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది.  తద్వారా నిద్ర సరిగ్గా రాదు.  రాత్రిపూట మన శరీరంలో ఈ హార్మోను ఉత్పత్తి అవుతుంది . దీనివల్ల మనం చీకటి పడగానే ఆటోమేటిక్గా నిద్రపోతాం.  కాని టీ,  కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల కెఫిన్ మెలోడీన్ ఉత్పత్తిని తగ్గించేస్తుంది. తద్వార రాత్రి నిద్ర పట్టదు . అంతేకాదు జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయట . ఎసిడిటీ కడుపు , ఉబ్బరం లాంటిది ఫేస్ చేయాల్సి ఉంటుంది.  మరీ ముఖ్యంగా దంతాలపై ఉండే  అనామిల్ పొర కూడా క్రమక్రమంగా తగ్గిపోతుందట.  హద్దులు మీరి టీ , కాఫీలు ఎక్కువగా తాగడం కారణంగా లివర్ కూడా చెడిపోయే ఛాన్సెస్ కొన్ని సందర్భాలలో ఉంటాయి అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.  కనక టీ , కాఫీలు లిమిట్స్ తో తీసుకోవడం మంచిది . అసలు పడి కడుపున టీ - కాఫీ తాగకుండా గోరువెచ్చని నీళ్లు ..జిలకర నీళ్లు తాగి.. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత ఇలా ఎప్పుడైనా ఒకటే లేదా రెండు కాఫీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది . అసలు తీసుకోకపోయినా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు డాక్టర్లు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: