స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన సినిమా. అయితే ఆ సినిమా ఏంటో చూద్దాం. త్రివిక్రమ్ అంటే మాటల మాంత్రికుడు అని సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉంది. కానీ ఇలాంటి ఆయన ఒకానొక సమయంలో ఫ్లాప్ లతో కుదేలు అయిపోయాడు. అలాంటి సమయంలోనే జులాయి లాంటి సినిమా కథతో వచ్చి తన స్టార్డమ్ ఏంటో  నిరూపించుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే ఒక మంచి హిట్ గా నిలిచింది. కానీ ఇందులో హీరోయిన్ కొద్దిగా మైనస్ కావడం జరిగిందన్న టాక్ అప్ప‌ట్లో అయితే వినిపించింది.

కానీ ఇలియానా మాత్రం తన పాత్ర కీ ఎలాగైనా న్యాయం చేయాలని చేసింది. ఇక ఈ చిత్రం కంటే ముందు అల్లు అర్జున్ కూడా ఫ్లాపుల్లో ఉన్నాడు. జులాయి సినిమా మాత్రం ఒక హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కిన  చిత్రం. ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి పంచు డైలాగులు , ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఈ సినిమాకి ప్లస్ ఏమిటంటే వరుడు ,వేదం సినిమాలో అల్లు అర్జున్ కొంచెం సైలెంట్ గా క్యారెక్టర్లో నటించడమే.. ఈ సినిమాకి బాగా ప్లస్. ఈ సినిమాలో బాగా సీరియస్, కామెడీ పాత్రలు చేయడమే ఈ సినిమాకి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు.

కథ పరంగా స్టోరీ లేకపోయినా దాదాపుగా 40 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా లాభాల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఎంతో బాగా పని చేసిందని చెప్పవచ్చు. ఇక అదే సమయంలో ఎన్నో సినిమాలు వచ్చిన 30 కోట్లకి మించి   ఏ సినిమా వసూళ్లను రాబట్టలేదు. ఇక ఈ సినిమా ఇప్పటికీ కూడా బుల్లితెరపై వచ్చిందంటే ప్రేక్షకులు ఎంతగానో చూస్తూ ఉంటారు. ఈ సినిమా బ‌న్నీ - త్రివిక్ర‌మ్ హిట్ కాంబినేష‌న్లో కూడా తొలి సినిమా..!

మరింత సమాచారం తెలుసుకోండి: