టాలీవుడ్ ఇండస్ట్రీ తో పోలిస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ కాస్త భిన్నమైనది అని చెప్పవచ్చు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో లవ్ ట్రాక్ లు నడపడం , వాటికి బ్రేకప్ చెప్పి ఎవరి పని వారు చూసుకోవడం చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. వీటిని కూడా వారు ఎక్కువగా పట్టించుకోరు. కానీ మన టాలీవుడ్ లో మాత్రం ఇలాంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ మరొక హీరోతో డేటింగ్ లో ఉంది అని విషయం బయటకు రావడం చాలా అరుదుగా జరుగుతుంటాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఇవి కాస్త ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. తాజాగా ఒక ప్రముఖ నటి తాను గతంలో ఒకరితో చేసిన సుదీర్ఘ డేటింగ్ గురించి ఓపెన్ అయ్యింది. ప్రముఖ నటుడితో తాను ఐదేళ్లు డేటింగ్ చేసిన విషయాన్ని తాజాగా బయటపెట్టి సంచలనంగా మారింది. 41 సంవత్సరాల హాట్ బావ నర్గీస్ ఫఖ్రీ. ప్రముఖ నటుడు అయిన ఉదయ్ చోప్రా తో తాను సుదీర్ఘ కాలం డేటింగ్ లో ఉన్నట్లు నర్గీస్ ఫఖ్రీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

రణబీర్ కపూర్ హీరోగా నటించిన 'రాక్ స్టార్' చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకు పరిచయమైన నర్గీస్ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాట్ బ్యూటీగా పేరు నా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ నటుడు దూమ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఉదయ్ చోప్రా తో కలిసి డేటింగ్ చేశాను అని, సహజీవనం చేస్తున్న వైనం కూడా అప్పట్లో హాట్ టాపిక్ గా నడిచేది. దీనిపై అప్పట్లో మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. వాటిని అప్పట్లో కొట్టిపారేస్తూ మేము మంచి స్నేహితులం అని చెప్పుకునేవారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం నర్గీస్ ఫక్రీ ఓపెన్ అయ్యి, ఉదయ్ చోప్రా తో ఐదేళ్లు డేటింగ్ లో ఉన్నాను అని చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: