సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషిస్తాయన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సినిమా విడుదలకు ముందు ఆ సినిమాలోని పాటలను విడుదల చేస్తారు. ఆ పాటలు కనుక హిట్ అయితే ఆడియన్స్ కి సినిమాపై ఆసక్తి కలుగుతుంది.ఇప్పుడు మన టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. సినిమాలో ఒక్క పాట కనుక హిట్ అయితే.. కచ్చితంగా ఆ సినిమా గురించి ఆరా తీస్తూ ఉంటారు ప్రేక్షకులు.ఇక అలాంటి ఓ పాటే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ' సినిమాలో 'సారంగదరియా' పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

చిన్నారుల నుంచి పెద్ద వారి దాకా ప్రతీ ఒక్కరినీ ఈ పాట ఎంతగానో అలరించింది.అంతేకాదు ఈ పాటని ఇటీవల ఓ కొరియన్ యువతి సైతం అద్భుతంగా పాడి అలరించింది.ఇక ఈ పాట మరో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఈ రోజు (అనగా సెప్టెంబర్ 24) విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని సారంగదరియా పాట మరో ఘనతను సాధించడం విశేషం.తాజాగా ఈ పాట ఏకంగా 325 మిలియన్ వ్యూస్ మార్క్ ని క్రాస్ చేసి ఫాస్టెస్ట్ రికార్డును అందుకుంది.ఇప్పటికే ఈ పాట పలు రికార్డ్స్ ని సాధించగా.. ఇప్పుడు మరో రికార్డ్ అందుకోవడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత శుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా..ఫోక్ సింగర్ మంగ్లీ ఈ పాటను పాడారు. ఇక నూతన సంగీత దర్శకుడు పవన్ సంగీతం అందించారు.ఇక రిలీజ్ రోజే సారంగదరియా ఈ రికార్డ్ అందుకోవడంతో దర్శకనిర్మాతలు ఫుల్ ఖుషి అవుతున్నారు.ఇక ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ అండ్ అమిగోస్ క్రియేషన్స్ పై నారాయణ్ దాస్, సునీల్ దాస్, రామ్మోహన్ సంయుక్త నిర్మించారు.ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున అంటే సుమారు 800 థియేటర్స్ కి పైగా రిలీజ్ అవుతున్న సినిమాగా లవ్ స్టోరీ సరికొత్త రికార్డును సృష్టించింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: