రిషబ్ శెట్టి హీరోగా నటించిన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ అక్టోబర్ 2 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన కాంతారా మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో కాంతారా చాప్టర్ 1 మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ చేసినట్లు జరిగింది. ఇప్పటికే విడుదల అయిన ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ రన్ కంప్లైంట్ అయింది. మొదటి రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 4.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.96 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.35 కోట్లు , ఈస్ట్ లో 74 లక్షలు , వెస్ట్ లో 20 లక్షలు , గుంటూరు లో 65 లక్షలు , కృష్ణ లో 91 లక్షలు , నెల్లూరు లో 41 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.80 కోట్ల షేర్ ... 16.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 91 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 80.20 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడితే హీట్ స్టేటస్ను అందుకుంటుంది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేస్తుందా ..? చేస్తే ఎన్ని కోట్ల లాభాలను అందుకుంటుంది అనే ఆసక్తి చాలా మంది జనాల్లో నెలకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: