యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో సూపర్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ సినిమా రౌద్రం రణం రుధిరం. కీరవాణి ఈ సినిమాకి అందించిన సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీంగా, రామ్ చరణ్ ఆలూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ కానుండగా దీనికి కేకే సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందిస్తున్నారు.
ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో భారీ స్థాయి వ్యూస్, లైక్స్ తో సంచలనం సృష్టిస్తుండగా ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తప్పకుండా ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడం ఖాయం అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ ని థియేట్రికల్ ట్రైలర్ లో కేవలం ఒక సీన్ కె పరిమితం చేయడంతో అసలు తనకి సినిమాలో సీన్స్ ఉన్నాయా లేదా అనేటువంటి అనుమానాన్ని పలువురు ప్రేక్షకాభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి మొదట టీమ్ ప్రకటించినప్పుడు ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ఒలీవియా కి కూడా మంచి ప్రాధాన్యత ఉందని, అయితే ట్రైలర్ కట్ లో భాగంగా సినిమాలో కీలక సీన్స్ మాత్రమే పెట్టవలసి రావడంతో ఆమె సన్నివేశాలు ఎక్కువగా కనపడలేదని, తప్పకుండా ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత టీమ్ అందరితో పాటు ఒలీవియా పాత్ర కి కూడా మంచి పేరు రావడం ఖాయం అని యూనిట్ చెప్తున్నట్లు సమాచారం. మొత్తంగా అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రిలీజ్ తరువాత ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: