కె. వి. భారవి.. ఈయన పేరు నేటి తరం యువతకు పెద్దగా గుర్తుండక పోయినా అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీ మంజునాథ వంటి సినిమాల పేర్లు చెబితే మాత్రం టక్కున గుర్తుకు వచ్చేస్తారు. భక్తిపారవశ్యంతో ప్రేక్షకులను మైమరపించేలా చేశారు ఈయన.. ప్రముఖ రచయితగా ఈ సినిమాలకు పని చేసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈయన ఎక్కువగా దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర ఎక్కువగా పని చేశారు. సినిమాలకు రచయితగా పనిచేసిన కే.వి.భారవి మాత్రమే. తెలుగులోనే కాదు కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసిన ఈయన అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ రచయిత వెల్లడించడం గమనార్హం.


తను ఇంటర్వ్యూ కి వచ్చేటప్పుడు ఓలా బైక్ పై రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని , ఆ దుస్థితికి గల కారణాలను కూడా వెల్లడించారు.. ఆయన మాట్లాడుతూ నేను చూసిన అన్ని కార్లు బహుశా ఎవరు చూసి ఉండరు.. నేను అనుభవించిన లగ్జరీ లైఫ్ ఎవరు అనుభవించి వుండరు. నారా జయశ్రీ దేవి గారు నన్ను దత్తపుత్రుడిగా స్వీకరించి ఆమె కొడుకు కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు. ఇక తెలుగులోనే కాదు కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా పనిచేశాను. ఇప్పటివరకు తెలుగు , కన్నడ సినీ ఇండస్ట్రీలో నేను సాధించిన రికార్డును ఎవరూ చెరపలేకపోయారు. ప్రస్తుతం కరోనా కారణం గా ఆ ఫండ్స్ ఇంక నాకు వేయలేదు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే చెరువులో నీళ్లు మళ్ళీ చెరువులోనే పోస్తే ఎలా ఉంటుందో అలా మారిపోయింది.
అలా సినిమాలలో సంపాదించిన డబ్బు అంతా సినిమాలతోనే వెళ్ళిపోయింది. జగద్గురు ఆదిశంకర సినిమా తీయకపోయి వుండి వుంటే ఈరోజు నేను ఈ దుస్థితికి వచ్చేవాడిని కాదు అంటూ ఆయన తెలిపాడు. ఇన్ని సంవత్సరాలు సినిమాల ద్వారా కూడబెట్టుకున్న డబ్బు మొత్తం ఈ సినిమా తో వెళ్ళిపోయింది. జగద్గురు ఆది శంకర సినిమా లో ఆయన ఎలా భిక్షం ఎత్తు కుంటూ తిరిగాడో ..ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే మారిపోయింది అంటూ ఆయన వివరించాడు. ఈ సినిమా వల్ల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నాను అంటూ తెలిపాడు కె.వి. భారవి.

మరింత సమాచారం తెలుసుకోండి: