క్రాక్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో మాస్ మహరాజ రవితేజ ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తూ బిజిగా వున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.. అయితే ఖిలాడీ మూవీ షూటింగ్ పూర్తీ చేసుకుంది. చిత్ర ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ విడుదల అయిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది. దాంతో సినిమా పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.


రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రానుంది. ఇకపోతే రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్ కు మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా కూడా చూస్తూంటే దేవికి మంచి హిట్ ను ఇచ్చేలా ఉందని తెలుస్తుంది. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై రూపొందుతున్న సంగతి తెలిసిందే..


ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా జోడి కట్టనున్నారు. రవి తేజ గతంలో చేసిన సినిమా లతో పోలిస్తే ఈ సినిమా మాస్ ట్రీట్ అని చెప్పాలి.అంతగా సినిమా మాస్ ఎలివేట్ తో తెరకెక్కుథుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు గ్రాండ్ గా నిర్వహిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి వస్తారని ప్రచారం జరుగుతుంది.. ఇక సినిమా ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: