టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఖిలాడి' ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోయింది. ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. నిజానికి మొదటి రోజు సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నా.. రెండోరోజు మాత్రం భారీగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం 'డీజే టిల్లు' సినిమా విడుదల కావడం. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి  కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో.. రవితేజ ఖిలాడి కలెక్షన్స్ రెండవ రోజు ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. 

ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన డీజే టిల్లు సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశం నిర్మించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో వీకెండ్లో డీజే టిల్లు హవా మరింత ఉండబోతోందని స్పష్టమవుతోంది. అయితే లాజిక్స్ లేకుండా సినిమా తీసినప్పటికీ సినిమాలో కామెడీ తో చేసిన మ్యాజిక్ మాత్రం ఆడియన్స్ దగ్గర విపరీతంగా వర్కౌట్ అయింది. దీంతో నిన్నటితో పోలిస్తే ఈ రోజు సినిమా కి మరింత ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి.

ఇంకా చెప్పాలంటే ఈ వీకెండ్ ఖిలాడి కంటే dj టిల్లు నే ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. అంతలా ఈ సినిమాని తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాలోని కామెడీ తో పాటు రొమాన్స్ ని సైతం తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ ప్లస్ పాయింట్ కాస్త రవితేజ ఖిలాడి సినిమాకి భారీ మైనస్ గా మారింది. మరి డీజే టిల్లు దెబ్బ రవితేజ ఖిలాడి పై ఏ రేంజ్ లో ఉందో తెలియాలంటే ఈ వీకెండ్ పూర్తవ్వాలి. మరోవైపు సోమవారం నుంచి డీజే టిల్లు సినిమాకి థియేటర్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ మేరకు రవితేజ ఖిలాడి కొన్ని సెంటర్లను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: