బాలీవుడ్లో ఒకప్పుడు బాగా అలరించిన హీరోయిన్ లలో రవీనాటాండన్ కూడా ఒకరు. గతంలో ఎంతో ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ యువతని బాగా ఆకట్టుకునేది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ సమయంలో తెలుగు తెరపై కూడా మెరిసిన ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆమె నటించిన బంగారు బుల్లోడు, రథసారధి వంటి సినిమాలలో నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు అంతంత మాత్రమే గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో ఎటువంటి సినిమాను కూడా చేయలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె కే జి ఎఫ్-2 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది.


ఈ సినిమాలో ఆమె ప్రధానమంత్రి రిమికా సేన్ పాత్రలో నటించి సినిమాకి హైలెట్ అయ్యేలా నటించింది. అయితే ఈ పాత్ర ఇందిరా గాంధీ పాత్ర కావచ్చని నెటిజెన్స్ భావిస్తున్నారు. ఇంత పవర్ఫుల్ పాత్ర, ఒక వైపు అరాచకం ,మరొకవైపు అవినీతి, ఈ రెండిటిని ఫేస్ చేసే ధైర్యం.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనే పాత్రల రవీనా టాండన్ విశ్వరూపాన్ని చూపించిందని చెప్పవచ్చు. దీంతో ఈమె పాత్ర కి న్యాయం చేయడంతో ఇప్పుడు తాజాగా పవన్ సినిమాలో నటించబోతోందని వార్త వినిపిస్తోంది.

పవన్ నటిస్తున్న భగవంతుడు భగత్ సింగ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఈమేను ఎంచుకోపోతున్నారనే వార్త ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. ఇక ఈమె ఈ పాత్రకు సరైన జోడీగా గా పవన్ ,హరి శంకర్ భావించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు ఈ చిత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత హరీష్ శంకర్ తో తన తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్ మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: