కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మానగరం అనే తమిళ సినిమాతో కెరియర్ ను మొదలు పెట్టాడు. తెలుగులో మనగరం మూవీని నగరం అనే పేరుతో విడుదల చేయగా ఈ సినిమా అటు తమిళం లోనూ ఇటు తెలుగు లోనూ భారీ విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత ఖైదీ, మాస్టర్ మూవీ లతో వరుస విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకున్నా లోకేష్ కనకరాజు తాజాగా విక్రమ్ సినిమాకు దర్శకత్వం వహించాడు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి , ఫహాద్ ఫాజిల్ , సూర్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. జూన్ 3 వ తేదీన విడుదల అయిన విక్రమ్ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా విక్రమ్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజు తన తదుపరి సినిమాను కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన తళపతి విజయ్ తో తెరకెక్కించబోతున్నాట్లు లోకేష్ కనకరాజు కొన్ని రోజుల క్రితమే తెలియజేశాడు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తలపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా పూర్తి కాగానే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో తలపతి విజయ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ , లోకేష్ కనకరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్టర్ సినిమా మంచి విజయం సాధించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే నెక్స్ట్  సినిమాపై  ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: