సాధారణంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న విధంగా వ్యవహరిస్తూ ఉంటారు హీరోయిన్లు. అయితే హీరోలు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా యువ హీరోయిన్లతో నటిస్తూ ఉంటారు. కానీ హీరోయిన్లు 30 ఏళ్ళు దాటిపోయాయి అంటే చాలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిమితం కావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎంతో మంది విషయంలో ఇది నిరూపితమైంది. ఈ క్రమంలోనే ఒక హీరో సరసన హీరోయిన్ గా రొమాన్స్ చేసిన వారు ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వేరే పాత్రలో నటించడం లాంటివి ఇప్పటివరకు ఎన్నో సార్లు చూసాము.


 ఇలా తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సరసన మొదట హీరోయిన్ గా ఆ తర్వాత చెల్లిగా ఇక మరికొన్ని రోజులకు తల్లిగా నటించిన హీరోయిన్ గురించి చాలా తక్కువ మంది ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.. 1975లో ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి హావ నడిపించింది సుజాత. తమిళ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగు తమిళ కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. 1980లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ప్రేమ తరంగాలు అనే సినిమాలో చిరు తో జోడీ కట్టి రొమాన్స్ చేసింది సుజాత.


 కట్ చేస్తే 1982లో చిరంజీవి హీరోగా వచ్చిన సీతాదేవి సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆ తరువాత 1990వ సంవత్సరంలో ఈ హీరోయిన్ తల్లి పాత్ర కూడా చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా నటించింది సుజాత. ఇలా ఒకే హీరోతో హీరోయిన్గా చెల్లిగా తల్లిగా నటించి అరుదైన  రికార్డు ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా తర్వాత అక్క చెల్లెలి పాత్రలో తర్వాత తల్లి పాత్రలో నటించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కానీ ఓకే హీరో సరసన ఇలా మూడు పాత్రల్లో నటించిన హీరోయిన్లు తక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: