అలాంటి హీరోయిన్ లలో ఒకరు నిత్యామీనన్. మలయాళ ముద్దుగుమ్మ గా సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఈమె మంచి సినిమాల్లో నటించింది.అందరిని ఆకట్టుకుంది. నటనతో ప్రేక్షకులను అలరించింది కానీ అందం పరంగా, గ్లామర్ పరంగా ఎవరిని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ విధంగా ఈ హీరోయిన్ గ్లామర్ పై శ్రద్ధ వహించకపోవడం పెద్ద మైనస్ అయిపోయిందని చెప్పాలి. దాదాపు ఆమె కెరీర్ తెలుగు లో అంతమైపోయిందనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాల్లో ఇటీవలే ముఖ్య పాత్రల్లో నటించి హీరోయిన్ గా చేయలేకపోతోంది. కుర్ర హీరోయిన్ లు ఇప్పుడు విచ్చలవిడిగా గ్లామర్ షో లు చేస్తుంటే ఈమె ప్రాబల్యం తగ్గుతుందని చెప్పాలి.
తెలుగు లో మంచి అభినయంతో పాటు గ్లామర్ షో కూడా చేసే హీరోయిన్ లు ఎక్కువవడంతో ఈ విధమైన కష్టాలు నిత్యా మీనన్ కి ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆమె కం బ్యాక్ చేయడం అంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. ఎప్పుడో కానీ ఆమెకు ఛాన్స్ లు రావడం లేదు. మళ్ళీ గ్లామర్ వైపు మొగ్గినా నిత్య మీనన్ టైం అయిపోవడంతో ఆమెను ఎవరు పట్టించుకోవచ్చు కూడా. నటిగా ఎంత సత్తా చాటినా అగ్ర హీరోయిన్ గా ఎదగలేరు అని చెప్పడానికి నిత్యామీనన్ కెరీర్ ఉదాహరణ. వచ్చే హీరోయిన్ లు కాస్త గ్లామర్ చూపించడం పై కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.