టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఇక తాజాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికే యూఎస్ తో సహా పలుచోట్ల ప్రీమియర్ షోలను కూడా ప్రదర్శించారు. ముఖ్యంగా ఈ మూవీ చూసిన నెటిజన్స్ , అభిమానులు అందరూ కూడా తమ రివ్యూ ను సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. మరి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

కార్తికేయ 2 సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. థ్రిల్ ఫ్యాక్టర్ తక్కువగా ఉన్నా కూడా టీం మొత్తం మంచి ప్రయత్నం చేశారు. ఇక సినిమా మాత్రం చాలా నచ్చింది అని ఒక నెటిజన్  కామెంట్ చేశాడు.. ఇక మరొక నెటిజన్ ఫస్ట్ ఆఫ్ బాగుంది..  ముఖ్యంగా కాలభైరవ బ్యాగ్రౌండ్ స్కోరు చాలా బాగా అందించారు. ఇక అసలు కథ సెకండ్ హాఫ్ లోనే ఉంటుంది అని మరొక నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. ఇక మరికొంతమంది ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుందంటూ తెలిపారు మొత్తానికైతే దర్శకుడు చందు మండేటి కథ హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుందని కూడా తెలిపారు.


ఇక విజువల్స్,  గ్రిప్పింగ్ నేరేషన్ థ్రిల్లింగ్ కు గురిచేస్తాయని కామెంట్లు కూడా చేస్తున్నారు. కార్తికేయ 2 మరో బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందంటూ తెలిపారు. ఇకపోతే చందు మండేటి దర్శకత్వంలో  తెరెకేక్కిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్,  టీజీ విశ్వనాథ్  నిర్మించడం జరిగింది. ఇకపోతే ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు. మొత్తానికైతే ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో కొనసాగడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమాకు 3.5 రేటింగ్ కూడా అందివ్వడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: