టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు ఆయన నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ కారుపొందుతూ ఉన్న నేపద్యంలో ఈ మూవీ యూనిట్ "#ఎన్ సి 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ను జరుపుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. 

ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ నాగ చైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్ లో రెండవ మూవీ.  ఇళయ రాజా , యువన్ శంకర్ రాజామూవీ కి సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో నటించబోయే కొంత మంది నటీ నటుల పేర్లను విడుదల చేసింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ లో ప్రియమణి ,  అరవింద స్వామి , శరత్ కుమార్ , వెన్నెల కిషోర్  , సంపత్ రాజ్  , ప్రేమ్ జీ అమరెన్ ,  ప్రేమి విశ్వనాథ్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ వీరికి సంబంధించిన పోస్టర్ లను కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన పోస్టర్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: