తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయిన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విశ్వక్ సేన్ ఇప్పటికే అనేక మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే విశ్వక్ సేన్ "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ యువ హీరో తాజాగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మితాలి పాల్కర్ హీరోయిన్ గా నటించగా ,  అశ్విత్ మరిముత్తు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుడు మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఓరి దేవుడా మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఓరి దేవుడా మూవీ కి మరో కోటి రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నట్లు సమాచారం. ఈ సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: