ఒకప్పుడు హాట్  హీరోయిన్ గా తన ఫిజిక్  తో కుర్రాలను నిద్రపోనీకుండా చేసిన ఇలియానా  1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్ క్రిస్టియన్, తల్లి ముస్లిమ్. ఇలియానా పదేళ్ళ వయసులో వారి కుటుంబం గోవాలోని పర్రా గ్రామం చేరుకుంది. ఇలియానా ర్యాంప్ షోస్ లో పాల్గొంటూ, తన నాజూకు షోకులతో మురిపించేది. తరువాత ‘ఎలక్ట్రోలాక్స్, ఇమామి’ యాడ్స్ లో తళుక్కున మెరిసింది. హిందీ చిత్రసీమలో అవకాశాల వేట ప్రారంభించిన సమయంలోనే ఇలియానాకు తెలుగు దర్శకుడు తేజ తన చిత్రంలో అవకాశమిచ్చారు. అయితే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మొదలు కాలేదు. అదే సమయంలో తన ‘దేవదాస్’ నాయిక కోసం వేట సాగిస్తున్న వైవిఎస్ చౌదరి, ఆమెను ఎంపిక చేసుకున్నారు. అలా ఇలియానా తొలి చిత్రం ‘దేవదాస్’ ఘనవిజయం సాధించడంతో ఆమె తెలుగు కుర్రాళ్ళ మదిలో చోటు సంపాదించింది. తరువాత పూరి జగన్నాథ్ ‘పోకిరి’లో ఏకంగా సూపర్  స్టార్  మహేశ్ బాబు సరసన మరింతగా మురిపించింది ఇలియానా.


రెండవ సినిమానే పెద్ద సూపర్ స్టార్ సినిమా. పైగా అందులోనూ మహేష్ బాబు అంటే.. ఇలియానా అదృష్టం ఎంత బాగుందో చూడండి. ఇక ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలచింది.ఆ సినిమా ఘనవిజయంతో ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె కాల్ షీట్స్ కాస్ట్లీగా మారిపోయాయి. టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరూ ఇలియానాతో జోడీ కట్టాలని ఉరకలు వేశారు. “ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, రెచ్చిపో, సలీమ్, శక్తి, జులాయ్” వంటి చిత్రాలలో ఇలియానా అందం జనానికి గంధం పూసింది. కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలోనూ ఇలియానా మత్తు చల్లింది. ఇలియానా ఎన్నో రోజుల నుంచీ కలలు కన్న బాలీవుడ్ ఎంట్రీ రణబీర్ కపూర్ ‘బర్ఫీ’తో లభించింది. అయితే తన కలే తన కెరీర్ నాశనంకి కారణమైంది.


ఎలా అంటే బాలీవుడ్ లో తొలి హిందీ చిత్రంతోనే ఇలియానాకు బంపర్ హిట్ దక్కింది. ఆ తరువాత హిందీ చిత్రసీమలోనే రాణిస్తూ సాగింది. ఇగో పెరిగింది. తెలుగు సినిమాలకు నో అంది. ఒకవేళ చేసే ఛాన్స్  వచ్చినా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసింది. బాలీవుడ్డే ముద్దంది. అయితే అక్కడ వరుసగా ఫ్లాపులు పలకరించగానే మళ్ళీ తెలుగు సినిమావైపు చూసింది. ఆ సమయంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో అవకాశం ఇచ్చాడు.తన ‘కిక్’ హీరోతో జోడీ కట్టింది ఇలియానా. అయితే ఆ సినిమా అంతగా అలరించలేదు. ఈ యేడాది అభిషేక్ బచ్చన్ తో కలసి ఇలియానా నటించిన ‘బిగ్ బుల్’ విడుదలయింది. అయితే కరోనా ప్యాండమిక్ కారణంగా థియేటర్లలో కాకుండా ఆ చిత్రం ‘హాట్ స్టార్’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలయింది. అది పోయింది.


ఇక ఇలియానాని పట్టించుకునేవాడు ఎవడు లేడు. ప్రస్తుతం ఆమె కెరీర్  విషయానికి వస్తే.. రణదీప్ హూడాతో కలసి ఇలియానా నటించిన ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’లో నటించింది. ఈ సినిమా విడుదల కావలసి ఉంది. ప్రస్తుతం శిరీష గుహ చిత్రంలో నటిస్తోంది ఇలియానా. ఇలియానా ప్రేమాయణాలు ఆమె పతనానికి కారణం అయ్యాయి.పైగా ఇలియానా సినిమాలు అన్ని పరాజయాన్నే చవిచూశాయి. ఆ దశలో ఇక ఏం చెయ్యాలో తెలీక తన ఫోటో షూట్స్ తో మళ్ళీ కుర్రాళ్ళను పిచ్చోళ్ళను చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయినా కూడా ఎందుకనో ఆమె అందాన్ని చూసి ఆస్వాదించేవాళ్ళు తప్ప ఆమెకి ఎవ్వరు అవకాశం ఇవ్వడం లేదు. అందుకే మునుపటిలా తెరపై ఇలియానా మురిపించలేకపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: