టాలీవుడ్ ఇండస్ట్రీ పాటల రచయితలలో రామజోగయ్యశాస్త్రి చాల డిఫరెంట్ గా కనిపిస్తాడు. నుదిటి మధ్యలో పెద్ద బొట్టు పెట్టుకుని సాంప్రదాయ బద్ధంగా కనిపించే రామజోగయ్యశాస్తి ఏకంగా ఫుల్ కోట్ వేసుకుని జీన్ ప్యాంట్ తో స్టైల్ గా నడుస్తూ కనిపించిన ఒక ఫోటో మీడియాలో వైరల్ గా మారింది. సాంప్రదాయ సాహిత్యంలో మంచి పట్టు ఉన్న ఈయన ఒక ఐటి ప్రోఫిషినల్ అని చాల కొద్దిమందికి మాత్రమే తెలుసు.


ఖరగ్ పూర్ ఐఐటి లో ఎంటెక్ చదివిన ఈయనకు సాహిత్యం పై మంచి పట్టు ఉండటంతో సినీ రచయితగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. వాస్తవానికి తెలుగులో ఇప్పుడు ప్రముఖ పాటల రచయితగా కొనసాగుతున్న ఈయన మొట్టమొదట ఒక కన్నడ సినిమాలో వ్రాసిన పాటతో మొదట్లో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.


తనకు పెద్దగా కన్నడం రాకపోయినా సంస్కృతం పై తనకు ఉన్న పట్టుతో తన మొదటి కన్నడ పాటను వ్రాయగలిగాను అనీ ఈయన అనేకసార్లు చెపుతూ ఉంటారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ సినిమాలలో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన ఈయనకు కృష్ణవంశీ ద్వారా సిరివెన్నెల సీతారామ శాస్త్రితో పరిచయం ఏర్పడింది. సిరివెన్నెల కు ఏకలవ్య శిష్యుడుగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పాటలు వ్రాసిన ఈయనకు సినిమాలలో నటించడం అంటే ఇష్టం.


శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ మూవీలలో ఈయన తళుక్కుమని మెరిసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర దర్శకుల సినిమాలకు పాటలు వ్రాస్తున్న ఈయన ఇలా ఒక కొత్త లుక్ లో కనిపించడంతో చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. అయితే ఈ లుక్ ఏదైనా సినిమాలో ఆయన నటించే పాత్రకు సంబంధించిందా లేదంటే ఆయన ఈమధ్య ఎప్పుడైనా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలాంటి లుక్ లో సందడి చేసాడా అన్నది సస్పెన్స్. సిరివెన్నెల మరణం తరువాత భావయుక్తమైన పాటలు వ్రాసే రచయితలు చాల తక్కువగా ఉండటంతో ఆలోటును రామజోగయ్యశాస్త్రి తీరుస్తున్నారు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: