తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే వరుస విజయా లతో ఫుల్ జోష్ లో ఉన్న శివ కార్తికేయన్ ఈ మూవీ లో హీరోగా నటించడం , జాతి రత్నాలు లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అనుదీప్ కేవిమూవీ కి దర్శకత్వం వహించడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రిన్స్ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి తెలుగు మరియు తమిళ భాషల్లో భారీ ఎత్తున కలెక్షన్ లు లభించలేదు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి  సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి విడుదల చేసిన సాంగ్స్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.  ఇలా విడుదలకు ముందు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ తెచ్చుకున్న ఈ మూవీ పాటలు సినిమా విడుదల తర్వాత కూడా ప్రేక్షకులను బాగానే అలరించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి "బింబిలిక్కి పిలపి" అనే వీడియో సాంగ్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం విడుదల చేసిన ఈ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. మరి ఈ వీడియో కు సాంగ్ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: