ఈవారం "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న మూవీ స్ వివరాలు ఇవే.
ఐరావతం మూవీ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో నవంబర్ 17 వ తేదీ నుండి తెలుగు భాషలో స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయిన కార్తీ తాజాగా సర్దార్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ నవంబర్ 18 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తమిళ్ మరియు తెలుగు భాషలో స్ట్రీమింగ్ కాబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతా రామం సినిమా హిందీ వర్షన్ నవంబర్ 18 వ తేదీ నుండి హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించగా , సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.


అనల్ మెలే పనితుల్లి మూవీ నవంబర్ 18 వ తేదీ నుండి తమిళ భాషలో సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. వండర్ వుమెన్ మూవీ నవంబర్ 18 వ తేదీ నుండి సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ , హిందీ , మలయాళం , ఇంగ్లీష్  భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ నవంబర్ 19 వ తేదీ నుండి తెలుగు  మరియు హిందీ భాషలలో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్  కాబోతోంది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన తార ఇతర కీలక పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott