తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగి ఉన్న శివ కార్తికేయన్ ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా శివ కార్తికేయన్ "ప్రిన్స్" అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి జాతి రత్నాలు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే డాక్టర్ , డాన్ మూవీ ల తర్వాత శివ కార్తికేయన్ నటించిన మూవీ కావడం , జాతి రత్నాలు మూవీ తర్వాత అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అయింది. 

మూవీ కి విడుదల మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేకపోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేకపోయిన ప్రిన్స్ మూవీ మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో నవంబర్ 25 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: