కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజిత్ ఇప్పటికే తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను తగ్గించుకున్నాడు. అజిత్ ఆఖరు గా వలిమై అనే పన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ తమిళ్ , తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ భాషల్లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే అజిత్ తాజాగా తునివు అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.  ఈ మూవీ లో మంజు వారియర్ అజిత్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ ని బోనీ కపూర్ నిర్మిస్తూ ఉండగా ,  జీబ్రాన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీని మరి కొన్ని రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన బిజినెస్ ను కూడా చిత్ర బృందం క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ యొక్క తెలుగు హక్కులను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. ఈ మూవీ యొక్క తెలుగు హక్కులను ఐ వి వై ప్రొడక్షన్స్ మరియు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: