తలపతి విజయ్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సంవత్సరం బీస్ట్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో తలపతి విజయ్ ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ తమిళ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విజయ్ "వరిసు" అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేసింది.

ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ నుండి మూడవ పాటకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... వారిసు మూవీ లోని మూడవ పాటను డిసెంబర్ 24 వ తేదీ లోపు విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేనున్నారు. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: