మెగాస్టార్ చిరంజీవి తాజాగా మాస్ ఎంటర్టైనర్ మూవీ వాల్తేరు వీరయ్య లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పవర్ మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్న బాబి ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... మైత్రి మూవీ సంస్థ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రకాష్ రాజ్ ... బాబీ సింహా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. మాస్ మహారాజ రవితేజమూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇలా ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు మరియు హిందీ భాషలలో జనవరి 13 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ నాకేమో అందమెక్కువ అనే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ లో చిరంజీవి ... శృతి హాసన్ అద్భుతమైన లొకేషన్ లలో వేసిన స్టెప్ లకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. 

అలాగే ఈ సాంగ్ లు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్స్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ  సాంగ్ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ క్రేజీ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి 4 పాటలు విడుదల కాక ఈ పాట 5 వ పాటగా విడుదల అయింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే వాల్తేరు వీరయ్య మూవీ పై మెగా అభిమానులు భారీ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: