
అయితే తాజాగా కీర్తి సురేష్ మళ్లీ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ వైరల్ గా మారుతోంది .ఈ చిత్రాన్ని చంద్రు డైరెక్షన్ లో ది రూట్ పాషన్ స్టూడియోస్ బ్యానర్లపై జగదీష్ సుధన్ సుందరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఒక విభిన్నమైన స్టోరీ తో రివాల్వర్ రీటా అనే టైటిల్‌తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు ఒక పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ని హీరోయిన్ సమంత తన ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది.
ఫస్ట్ లుక్ పోస్టర్లు కీర్తి సురేష్ రెండు గన్స్ పేలుస్తూ పోస్టర్‌తో అదరగొట్టేసింది.ఇక ఈ పోస్టర్ని షేర్ చేసిన కీర్తి సురేష్ ఇదిగో రివాల్వర్ రాణి రీటా రూట్ అండ్ ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించబోతున్నాము అంటు రాసుకు వచ్చింది. ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానంటూ తెలియజేస్తోంది. ఇక డైరెక్టర్ వెంకట ప్రభు బ్లాక్ బాస్టర్ సినిమా మానాడు సినిమాకు మాటలు అందించిన కే చంద్ర ఈ సినిమాతో డైరెక్టర్ గా మారబోతున్నారు.