స్టార్ హీరోయిన్ అయిన సమంత  హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల లో ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా గా సమంత టైటిల్ రోల్ గా తెరకెక్కిన సినిమా శాకుంతలం.

ఈ చిత్రం షూటింగ్ పనులు కూడా పూర్తి చేసుకుని విదుదలకు అయితే సిద్దంగా ఉంది. అంతేకాక ఈ చిత్ర విడుదల తేది ని కూడా అనోన్స్ చేసారు మేకర్స్. కానీ, ప్రస్తుతం శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడినట్టు కూడా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటన  మాత్రం విడుదల కాలేదు.

 వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 17న విడుదల కావాల్సి ఉంది. తెలుగు, తమిళం, హిందీలో కూడా రిలీజ్ కు సినిమా నిర్మాతలు నిర్ణయించారు. అయితే, ఇప్పుడు పఠాన్ సినిమా భారీ వసూళ్ల తో రికార్డులు సృష్టిస్తుంది.

పఠాన్ కు భారీ ఆదరణ వస్తున్న ఈ సమయం లో శాకుంతలం హిందీ వెర్షన్ విడుదల సరికాదని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.. కనుక ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 17న కాకుండా, కొన్ని రోజుల తర్వాతే శాకుంతలం విడుదల చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ సినిమా కు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. పఠాన్ ఉత్తరాది న భారీ విజయాన్ని నమోదు చేస్తోందని తెలుస్తుంది.

కనుక తగినన్ని స్క్రీన్లు లభించకపోవచ్చని శాకుంతలం టీమ్ కూడా భావిస్తోంది. కార్తీక్ ఆర్యన్ నటించిన షెజదా సినిమా సైతం ఫిబ్రవరి 10న విడుదల కావాల్సి ఉండగా, దాన్ని కూడా వాయిదా వేసుకున్నారని సమాచారం.. దీంతో మార్చి నెలలో శాకుంతలం విడుదల చేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం. దీనిపై అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. అయితే సమంత కూడా వరుస సినిమాలను ఒప్పుకుంటుంది. తను మాయో సైటీస్ వ్యాధితో బాధ పడుతున్న కానీ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇస్తూ బాగా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది మరి చూడాలి శాకుంతలం సమంతకు ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో…

మరింత సమాచారం తెలుసుకోండి: