నందమూరి వారసుడు నందమూరి తారకరత్న సినిమాలలో స్టార్ పొజిషన్ కి చేరుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయేసరికి రాజకీయాలలో బిజీ కావాలని నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తో కలిసి కొంత దూరం నడిచారు. అయితే వెంటనే స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స జరిపి తారకరత్నకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. వెంటనే మెరుగైన చికిత్స కోసం పీ ఈ సీ హాస్పిటల్ కు తరలించగా అక్కడ గుండె ఎడమ కవాటం 90% బ్లాక్ అయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించారు.

అక్కడ ప్రత్యేకంగా 10 మంది వైద్య బృందంతో తారకరత్నకు ప్రత్యేక చికిత్స జరిగింది. అయితే ఆయన గుండె సహజంగా కొట్టుకోవడం లేదని కృత్రిమంగా ఎక్మో ద్వారా గుండె పనితీరును మెరుగుపరచడానికి వైద్యులు సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. మరొకవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తోందని,  జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి కూడా వచ్చినట్లు తెలపడంతో అటుకుటుంబ సభ్యులు ఇటు అభిమానులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా తారకరత్న బ్రెయిన్ కి సర్జరీ జరిగినట్టు.. స్కాన్ రిపోర్టు రాగానే మెరుగైన వైద్య చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో ఆయనను విదేశాలకు తరలించనున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి ఈ విషయం తెలిసి అభిమానులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా లేక ఏదైనా కారణాల రీత్యా విదేశాలకు తీసుకువెళ్లనున్నారా అంటూ కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఏది ఏమైనా తారకరత్న దేవుడి దయతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: