1980 నుండి 90 వరకు ఒక దశాబ్దకాలం పాటు భానుప్రియ హవా కొనసాగింది. మంచి నటి మాత్రమే కాకుండా ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ కూడ ఆకాలంలో ఒక వెలుగు వెలిగిన టాప్ హీరోలు అందరితోను భానుప్రియ నటించడమే కాకుండా అనేక సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఆతరువాత వచ్చిన హీరోయిన్స్ పోటీ మధ్య ఆమె నిలదోక్కుకోలేకపోవడంతో ఆమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.


ఆతరువాత వాస్తవిక దృష్టితో ఆలోచించి ఇండస్ట్రీలో మరొక విధంగా నిలదొక్కుకోవాలని ‘ఛత్రపతి’ సినిమాలో ఆమె ప్రభాస్ కు తల్లిగా నటించి నటిగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో దర్శకులు ఎవరు తల్లి పాత్రలు కూడ ఇవ్వలేదు. ఈ పరిస్థితితో ఇంచుమించు ఆమె ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పింది.


ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది అని చెపుతూ ఆమె క్రమంగా జ్ఞాపక శక్తి కూడ తగ్గిపోతోందట. ఈ సమస్య వల్ల సినిమాల్లో డైలాగులు చెప్పలేకపోతున్నానని డ్యాన్స్ స్కూల్ పెట్టాలన్న ఆలోచన కూడా విరమించుకున్నట్లు ఆమె ఆమె చెప్పింది. “మా వారికి నాకు గొడవ జరిగి విడాకులు తీసుకున్నట్లు మీడియాలో కొన్నేళ్ల ముందు వార్తలు వచ్చాయి. అది అబద్ధం. మా మధ్య ఏ సమస్యలు లేవు. ఆయన అనారోగ్యం వల్ల కొన్నేళ్ల కిందట మరణించారు. ఆ తర్వాత నాకు జ్ఞాపక శక్తి తగ్గడం మొదలైంది. నృత్యానికి సంబంధించి హస్త ముద్రలు కూడా మరిచిపోయాను. ఆ మధ్య ఒక తమిళ సినిమా షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మరిచిపోయా’ అంటూ ఆమె తన ప్రస్తుత పరిస్థితిని ఆ ఇంటర్యూలో వివరిస్తున్నప్పుడు ఆమె అభిమానులు చాలామంది బాధ పడ్డారు.  అయితే ప్రస్తుతానికి మందులు తీసుకుని కోలుకునే ప్రయత్నం చేస్తున్న ఈమె ప్రయత్నాలు విజయవంతం అయి తిరిగి ఆమె మళ్ళీ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే రోజులు రావాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: