కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇద్దరు కాంబినేషన్ లో వారిసు అనే సినిమా వచ్చింది. తమిళంలో వారిసుగా సూపర్ హిట్ అందుకోగా అదే సినిమా తెలుగులో వారసుడుగ రిలీజైంది. వారసుడు సినిమా మాత్రం తెలుగు ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. ఆల్రెడీ తెలుగులో వచ్చిన చాలా సినిమాల రిఫరెన్స్ లు ఆ సినిమాలో కనిపించాయి. ఇదిలాఉంటే వారిసు మాత్రం కోలీవుడ్ లో విజయ్ రేంజ్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి వంశీ పైడిపల్లితో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నారట హీరో విజయ్.

ప్రస్తుతం విజయ్ తన నెక్స్ట్ సినిమా లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉంది. లియో టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత వంశీ డైరెక్షన్ లోనే విజయ్ సినిమా ఉంటుందని టాక్. ఆ సినిమాను దిల్ రాజు నిరంస్తారని అంటున్నారు. అయితే ఈసారి వారిసులా కేవలం తమిళ సినిమాగా కాకుండా పాన్ ఇండియా సినిమాగా చేస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగులో విజయ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయన్ని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారట.

రీసెంట్ గా ధనుష్ సార్ తో తెలుగులో కూడా మంచి హిట్ అందుకున్నాడు. అందుకే ఈసారి విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై గురి పెట్టినట్టు తెలుస్తుంది. వారసుడు టైం లో తెలుగులో అసలు ప్రమోషన్స్ చేయని విజయ్ ఈసారి వంశీ తో సినిమా చేస్తే మాత్రం కచ్చితంగా తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తారని తెలుస్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది చూడాలి. దిల్ రాజు ఈసారి భారీ బడ్జెట్ తో మాస్ సినిమాను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. విజయ్ తో మాస్ సినిమా అంటే మామూలుగా ఉండదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: