అయితే ఇక అటు వైష్ణవ్ తేజ్ మాత్రం ఉప్పెన సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. అతని మాత్రం ఖాతాలో హిట్ వేసుకోలేకపోతున్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఉప్పెన సినిమాలో ఆసీ పాత్రలో వైష్ణవ్ తేజ్ నటన అద్భుతం అని చెప్పాలి. మొదటి సినిమా అయినప్పటికీ తన హావా భావాలతో పాత్రకు ప్రాణం పోశాడు. అయితే దర్శకుడు బుచ్చిబాబు ముందుగా ఈ కథ రాసుకున్నప్పుడు హీరోగా వైష్ణవ్ తేజ్ ని అనుకోలేదట. ముందుగా ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు న్యాచురల్ స్టార్ నాని అయితే హీరోగా బాగా సెట్ అవుతాడని బుచ్చిబాబు భావించాడట.
కానీ ఈ విషయంలో మాత్రం బుచ్చి బాబుకు చేదు అనుభవం ఎదురయిందట. ఉప్పెన కథను వినిపించాలని ఎంతో ఆశగా నాని ఇంటికి వెళ్ళాడట బుజ్జిబాబు. అయితే అప్పటికే ఫుల్ కాల్ షీట్స్ తో బిజీ బిజీగా ఉన్నాడట నానీ. దీంతో ఇక బుచ్చిబాబు కథ అసలు ఎలా ఉందో కూడా వినకుండానే నాని ఇక ఉప్పెన కథను రిజెక్ట్ చేశాడట. ఇక ఆ తర్వాత పలువురు యంగ్ హీరోస్ దగ్గరికి ఈ కథ వెళ్ళింది. కానీ స్టోరీ నచ్చిన దర్శకుడు కొత్త కావడంతో రిజెక్ట్ చేశారట. చివరికి ఈ కథను వైష్ణవ్ తేజ్ చేసి హిట్టు కొట్టాడు. ఒకవేళ నాని చేసి ఉంటే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అతని ఖాతాలో చేరిపోయేది అని ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు.