తెలుగు సినీ ప్రజలకి నటి కస్తూరి శంకర్ గూర్చి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమెను చాలామంది కస్తూరి శంకర్ అంటే గుర్తు పెట్టకపోవచ్చు కానీ ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తులసి అంటే చాలు సెకండ్స్ లో గుర్తు పడతారు.

ఐతే ఆమె ఈ సీరియల్ తో భారీగా పాపులారిటీని సొంతం చేసుకుంది.అలానే ఆమె ఈ సీరియల్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన క్రేజ్ ని కూడా సొంతం చేసుకుంది.కాగా కస్తూరి శంకర్ ఒక వైపు సీరియల్స్ లో నటిస్తూనే ఇంకొక వైపు ఈవెంట్లలో పాల్గొంటూ అప్పుడప్పుడు కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉండే లేటెస్ట్ గా ఆమె యాంకర్ అనసూయ కి మద్దతుగా నిలుస్తూ కామెంట్స్ చేసింది. తాజాగా అనసూయను ఆంటీ అన్న వివాదం పై స్పందించిన కస్తూరి శంకర్ ఈ విధంగా అన్నది.చిన్న పాప ఆంటీ అని పిలవడానికి దున్నపోతు లాగా ఉన్న మనిషి  వచ్చి మిమ్మల్ని ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంది.పెద్దవాళ్ళైతె మహిళలను ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదు అని చెప్పింది. చిన్న పిల్లలు మాత్రమే ఆంటీ అనొచ్చు అని,అదే ఒక హీరోను లేదంటే నటుడును అంకుల్ అని పిలుస్తారా అని ప్రశ్నించింది.అనసూయ కంటే రెట్టింపు వయసు ఉన్న హీరోలను ఒక్కసారి అంకుల్ అని చూడండి మీకే తెలుస్తుంది అని అన్నది.ఐతే ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ కూడా ఉంది అని గుర్తు చేసింది.మీకు ఇతరులపై గౌరవం లేకపోతె మాత్రమే ఆంటీ అని పిలుస్తారు.ఈ విషయంలో నేను అనసూయ కి మద్దతుగా ఉంటాను అని చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్. కస్తూరి శంకర్ విషయానికి వస్తే ఈమె అప్పట్లో భారతీయుడు,అన్నమయ్య వంటి సినిమాలలో చేసి మెప్పించిన విషయం అందరికి తెలిసిందే.

వెండి తెర పై ఛాన్సెస్ కోసం ఆమె ట్రై చేస్తుంది అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: