ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నారు దిల్ రాజు. నిర్మాతగానే కాకుండా డిస్టిబ్యూటర్ గా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరును తెచ్చుకున్నాడు దిల్ రాజు .దిల్ సినిమాతో తన కెరియర్ను ప్రారంభించిన దిల్ రాజు ఆ సినిమా అనంతరం ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు వరుసగా ఆరు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని డబల్ హార్ట్ రిక్ కొట్టిన తెలుగు నిర్మాతగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన బొమ్మరిల్లు, పరుగు, కొత్త బంగారులోకం ,సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, శతమానంభవతి, సుప్రీం, నేను లోకల్, ఫిదా, రాజా ది గ్రేట్

 ఇటువంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు దిల్ రాజు .వరుస విజయాలతో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. నిర్మాతగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈయన ఎప్పుడూ డైరెక్షన్ మీద మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ  విషయంపై ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పుకొచ్చారు. దిల్ రాజు కి డైరెక్టర్ గా మారడం కంటే కొత్త కొత్త డైరెక్టర్లను సృష్టించడం అంటేనే ఇష్టం అని ఈ మాట స్వయంగా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నాకు అసలు డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదు అని..

నాకు కొత్త కొత్త డైరెక్టర్లను పరిచయం చేయడం అంటేనే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు.. కొత్త డైరెక్టర్లకు జీవితాన్ని ఇచ్చిన ప్రతిసారి నాకు చాలా ఆనందంగా ఉంటుంది... సుకుమార్ ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.. ఆయనతోపాటు వంశీ పైడిపల్లి కూడా డైరెక్టర్గా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు ..ఇలా మా ప్రొడక్షన్ బ్యానర్ లో ఎంతో మంది పెద్ద డైరెక్టర్లుగా మారారు అంటూ చాలా సంతోషంగా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఇదిలా ఉంటే ఇక ఈ మధ్యనే వారసుడు సినిమాని నిర్మించి ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న మరొక సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు దిల్ రాజు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: