
గత కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ ఎప్పుడో వివాహం చేసుకుంటారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఎప్పటికప్పుడు వీరికి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ వచ్చాయి. ఏ సినిమాలో నటించినా భార్యాభర్తలుగా నటించడం లేదా ప్రతి ఫంక్షన్కు ఈవెంట్ కు కలిసే వెళ్తూ ఉండడంతో అనుమానాలు బాగా రేకత్తాయి. ఇక ఈ ఏడాది లిప్ కిస్ తో ఒక వీడియోను షేర్ చేసుకున్న ఈ జంట వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.
ఇక రంగంలోకి దిగిన నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా వీరిద్దరి పెళ్లిని ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది.. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే నరేష్ తాను ఇష్టపడిన పవిత్ర లోకేష్ ను ఈ రోజు వివాహం చేసుకొని నాలుగవ పెళ్లికి ఆరంభం పలికారు ..మరి ఈ పెళ్లితోనైనా ఆయన తన జీవితాంతం సుఖంగా జీవితాన్ని కొనసాగిస్తారా లేక ఇది కూడా మూడునాళ్ళ ముచ్చటగానే మారిపోతుందా అన్నది ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికైతే పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకొని మళ్లీ వార్తల్లో నిలిచారు నరేష్.