ఇప్పటికే ఎన్నో సినిమా పాటలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించి అద్భుతమైన డాన్సర్ గా పేరు తెచ్చుకొని అలాగే ఎన్నో సినిమా లలో నటించి తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుని ... అలాగే ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలు అందుకొని దర్శకుడు గా కూడా సూపర్ క్రేజ్ ను తెచ్చుకున్న రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

కెరీర్ ప్రారంభంలో సినిమా పాటలకు కొరియో గ్రాఫర్ గా వ్యవహరించ లారెన్స్ ఆ తర్వాత సినిమాల్లో నటించడం ... సినిమాలకు దర్శకత్వం వహించడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం లారెన్స్ సినిమాల్లో నటించడం మరియు సినిమాలకు దర్శకత్వం వహించడం చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా లారెన్స్ తమిళం లో రూపొందిన రుద్రన్ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... కతరేశన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని రుద్రుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ను కూడా ఏప్రిల్ 14 వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని 2 గంటల 30 నిమిషాల నిడివి తో ఈ మూవీ బృందం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: